బీఆర్ఎస్ ఆవిర్భావ దిన్సోతవం సందర్భంగా తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెదక్ జిల్లాకు చెందిన ఆర్టిస్ట్ డానియెల్ రూపొందించిన సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు.
కార్యక్రమంలోశాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీకోటిరెడ్డి, సూర్యాపేట జడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్‌కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల గ్రంథాలయాల చైర్మన్లు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.