మోత్కూరు, ఏప్రిల్ 1: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు రైతు సేవా సహకార బ్యాంకు ఉద్యోగుల నిర్వాకం బట్ట బయలైంది. అర్థరాత్రి సమయంలో ప్రైవేట్ వ్యాపారులు, దళారీలతో కలిసి బ్యాంకు సిబ్బంది దావత్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ చాంబర్లో కూర్చోని మ ద్యం సేవించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. అర్థరాత్రి వరకు సింగిల్ విండో కార్యాల యం తెరిచి ఉంచి నలుగురు ఉద్యోగులు కార్యాలయంలోనే యథేచ్ఛగా మందు సేవించారు. సింగి ల్ విండో ఉద్యోగులతో పాటు నల్లగొండ గ్రామీణ సహకార బ్యాంకు మోత్కూరు శాఖ ఉద్యోగి ఒకరు, అడ్డగూడూరు సింగిల్ విండో కార్యాలయ ఉద్యోగితో కలిసి మొత్తం నలుగురు మందు సేవించిన వారిలో ఉన్నారు. విధులు ముగించుకొని వెళ్లాల్సిన ఉద్యోగులు ఇలా కార్యాలయంలోనే మందుతో దావత్ చేసుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులు చైర్మన్ చాంబర్‌కు కనీసం గౌరవం ఇవ్వకుండా టెబుల్పైనే మందు సీసాలు, తినుబండరాలు పెట్టి మద్యం సేవించడం సరికాదన్నారు. విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లిన విలేకరులు(నమస్తే తెలంగాణ కాదు) ఫొటోలు, వీడియోలు తీస్తుండగా అడ్డుకున్నారు. ఫొటోలు, వీడియోలు తీసి ఏం చేసుకుంటావ్.. ఎవరికి చెప్పుకుంటావో..చెప్పుకో..అంటూ బెదిరింపులకు దిగారు. దళారుల నుంచి ముడుపులు తీసుకొని అర్థరాత్రి లోన్లు మంజూరు చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.