ఈ నెల 15న ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు మంగళవారం ముగిశాయి. పరీక్ష అనంతరం ఆయా సెంటర్ల వద్ద సందడి నెలకొంది. విద్యార్థులు ఫ్రెండ్స్‌తో సెల్ఫీలు దిగుతూ, బై బై చెప్పుకొంటూ కనిపించారు.
నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి కళాశాల వద్ద ఇంటర్ ఫస్టియర్ విద్యార్థినుల సంతోషం. దీంతో తల్లిదండ్రులు వెంటరాగా హాస్టల్స్ నుంచి విద్యార్థులు ఇంటి బాట పట్టారు. నల్లగొండ జిల్లాలో రెగ్యూలర్, ఓకేషనల్ విభాగాల్లో చివరి రోజు 14,775 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5,894 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
– భువనగిరి సిటీ, మార్చి 28