సూర్యాపేట, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లాలో రైతులకు జరుగుతున్న అన్యాయాలు… నీళ్లు లేక ఎండిన పంటలపై ఈ ఏడాది నమస్తే తెలంగాణ సమర శంఖం పూరించింది. ఎండిన పొలాలు, విద్యుత్తు సరఫరాలో అంతరాయం, యూరియా కష్టాలు ఇలా అనేక రైతుల బాధలు, గాథలు కదిలించే కథనాలను ప్రచురించి రైతుల పక్షాన నిలిచింది. రెవెన్యూ, వైద్య, ఎక్సైజ్, పోలీస్ ఇలా అనేక శాఖల్లో జరిగిన, జరుగుతున్న అవినీతి, అక్రమాలపై వెలువరించిన సంచలన కథనాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి పలువురిని సస్పెండ్ చేయడం ద్వారా బాధితుల పక్షాన నిలిచింది. అందులో భాగంగా ఏడాది కాలం పాటు జనం పక్షాన నిలిచి ప్రచరించిన కథనాలు మచ్చుకు కొన్ని….