చండూరు, సెప్టెంబర్ 25 : సమాజంలోని పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందజేయడమే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన లక్ష్యం అని బీజేపీ నల్లగొండ జిల్లా కోశాధికారి కాసాల జనార్దన్ రెడ్డి అన్నారు. బీజేపీ చండూరు మండల శాఖ అధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో మొక్కలు నాటారు. తాస్కానిగూడెం, గొల్లగూడెం గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో జనార్దన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అన్నెపర్తి యాదగిరి, మాదగోని నాగార్జున, మండల ప్రధాన కార్యదర్శి ఆవుల అశోక్ యాదవ్, సీనియర్ నాయకులు ఆవుల వెంకన్న యాదవ్, బూత్ అధ్యక్షుడు కట్కూరి రామలింగయ్య, పల్లపు స్వామి, నాయకులు మాదగోని సురేశ్, కొండా విఘ్నేష్, ఆవుల కిరణ్, ఆవుల నవీన్, నరాముల సందీప్, నరాముల భూపాల్, గెలగోని గణేష్, హన్మంత్ లక్ష్మణ్, ఆవుల అశోక్, ఆవుల శ్రీకాంత్, రాపోలు, సందీప్ పాల్గొన్నారు.