కట్టంగూర్, జూలై 17 : పేదల సొంతింటి కల నేరవేర్చడమే ప్రభుత్వం లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం కట్టంగూర్ మండలంలోని గార్లబాయిగూడెం, చెర్వుఅన్నారం, రామచంద్రపురం, అయిటిపాముల, కట్టంగూర్, ముత్యాలమ్మగూడెం, ఉగినవెల్లి, ఎరసానిగూడెం, పామనుగుండ్ల, భాస్కర్ణబాయి, పిట్టంపల్లి, ఇస్మాయిల్పల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అర్హులైన ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టాలని, విడతల వారిగా డబ్బులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి, నాయకులు రెడ్డిపల్లి సాగర్, పులిగిల్ల అంజయ్య, నంద్యాల వెంకట్ రెడ్డి, బెజవాడ సైదులు, ఎడ్ల పెద రాములు, ముత్యాల లింగయ్య, మిట్టపల్లి శివ, మర్రి రాజు, సుంకరబోయిన వెంకన్న, వనం రాంబాబు, బండారు కృష్ణ, చౌగోని సాయిలు, గద్దపాటి దానయ్య, మాద లింగస్వామి, రెడ్డిపల్లి స్వామి, ముక్కాముల శేఖర్, అయితగోని నర్సింహ్మ, దార భిక్షం, బూరుగు శ్రీను, గట్టిగొర్ల సత్తయ్య, చెరుకు శ్రీను పాల్గొన్నారు.