తుంగతుర్తి, జనవరి 5 : పోలీసులు విచారిస్తుండగా ఓ రైతు గుండెపోటు తో మృతి చెందిన సంఘటన సూ ర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. రావులపల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం 2007లో కేతిరెడ్డి విజయసేనారెడ్డికి చెందిన 11 ఎకరాల భూమిని రైతు లాజరస్ కొనుగోలు చేశాడు. నాటి నుంచి నేటి వరకు లాజరస్ కబ్జాలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు.
అయితే ఇటీవల కాలంలో విజయసేనారెడ్డి భార్య సౌజన్యారెడ్డి, ఆమె కూతు ళ్లు, తుంగతుర్తి తాసీల్దార్‌తో మాట్లాడుకోవడంతో ఆయన.. రైతుకు తెలియకుండా రెండెకరాల 20 గుంటల భూమిని, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా పట్టా చేశారు. భూమి వివాదం కొనసాగుతుండగా జనవరి 2న తుంగతుర్తి తహసీల్ కార్యాల యం వద్ద తనకు న్యాయం చేయాలని కోరుతూ లాజరస్తో పాటు మరికొంతమంది రైతులు ధర్నా చేశారు.
ఈ విషయమై సోమవారం ఉదయం రావులపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో బాధి త రైతులతో తుంగతుర్తి సీఐ నరసింహారా వు విచారణ జరుపుతుండగా లాజరస్‌కు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం తీసుకెళ్తుండగా మృతి చెందా డు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, సౌజన్యారెడ్డి ఇంటి ఎదుట ఉంచి ధర్నా చేశారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తుంగతుర్తి తాసీల్దార్, ఎస్సైలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.