నిడమనూరు, జూలై 31 : కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండల పరిధిలోని సూరేపల్లి గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకుడు పసుపులేటి సైదయ్య నాయుడుతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముంగి శివ మారయ్య, కొండ శ్రీనివాస్‌రెడ్డి, నర్సింగ్ విజయ్ కుమార్, సంకూరి రాంబాబు, పంచాయతీ కార్యదర్శి కందుల సత్యనారాయణ, మార్కెట్ డైరెక్టర్ మెండె వెంకటేశ్వర్లు, సంకూరి జానకిరాములు పాల్గొన్నారు.