కట్టంగూర్, జనవరి 5 : సీఎం కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మేకల రమేశ్, జనార్ధన్ ఆధ్వర్యంలో మండలంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన 100మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు నార్కట్‌పల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో గురువారం చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను, నిరుద్యోగులను మోసం చేస్తోందన్నారు. అన్ని ప్రభుత్వ సంస్థలను విక్రయించడంతో పాటు, మత కలహాలు సృష్టిస్తూ దేశాన్ని అభివృద్ధికి దూరం చేస్తున్నదని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్నదన్నారు. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ, ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో మనుగడ లేదని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, ఉప సర్పంచ్ అంతటి శ్రీను, పులిగిల్ల వెంకన్న, అంతటి నగేశ్, మేకల శివ, మేడి ఆంజనేయులు, సాలయ్య, ఏర్పుల యాదయ్య, వీరమల్ల రామలింగయ్య, లక్ష్మయ్య, శంకర్, శ్రీను, రాధ పాల్గొన్నారు.