రామన్నపేట, సెప్టెంబర్ 30 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు రైతు రుణమాఫీని బేషరతుగా అమలు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. హామీలను విస్మరించిను కాంగ్రెస్ కాంగ్రెస్ సర్కారును ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. రామన్నపేట మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
డిసెంబర్ 9నాటికి రెండు లక్షలల్లోపు పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తానన్న రేవంత్ సర్కారు తొమ్మిది నెలలైనా అమలు చేయకుండా రైతులను మోసం చేసిందన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి మాట నిలబెట్టుకోనందుకు గన్‌పార్క్‌వద్ద ముక్కునేలకు రాసి సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. రైతు సంక్షేమం కోసం పాటుపడిన కేసీఆర్ సర్కార్‌ను కాదని కాంగ్రెస్‌కు ఓటేసిన అన్నదాతలు ఇబ్బందులు బాధ పడుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో స్థానిక ఎన్నికలకు గ్రామాల్లో ఆ పార్టీ నాయకులు ముఖం చాటేసుకుని పోతున్నారని పేర్కొన్నారు. అధికారంలో లేమని బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడవద్దని, ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటందని భరోసానిచ్చారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్, ధాన్యానికి బోనస్ అమలు చేసే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ కార్యకర్తలు పోరాడాలని కోరారు. ధర్నా అనంతరం ర్యాలీగా వెళ్లి తాసీల్దార్ లాల్ బహదూర్‌కు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోశబోయిన మల్లేశం, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు బందెల రాములు, కంభంపాటి శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌లు ఎడ్ల మహేందర్‌రెడ్డి, బత్తుల శంకరయ్య, కోళ్ల స్వామి, బందెల యాదయ్య, మాజీ ఎంపీటీసీలు వేమవరపు సుధీర్‌బాబు, గొరిగె నర్సింహ్మ, సాల్వేరు అశోక్, దోమల సతీశ్, ఉమారమేశ్, పున్న వెంకటేశం, రైతు సంఘం మాజీ మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, నాయకులు కన్నెబోయిన బలరాం, ఎస్కే చాంద్, బత్తుల వెంకటేశ్, జాడ సంతోశ్, మిర్యాల మల్లేశం, కూనూరు ముత్తయ్య, బండ శ్రీనివాస్‌రెడ్డి, ఆవుల నరేందర్, గర్దాసు విక్రమ్, రామిని లక్ష్మణ్, బాలగోని శివ, మామిండ్ల అశోక్, మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, పులిపలుపుల వీరస్వామి, గుండాల రాంబాబు, పున్న వెంకటేశ్, ఆవుల శ్రీధర్ పాల్గొన్నారు.