నీలగిరి, ఏప్రిల్ 15 : పిల్లలు. మహిళలకు ఆరోగ్యకరమైన పోషకాహారం అందించడమే పోషణ్ అభియాన్ లక్ష్యమని నల్లగొండ ఐసిడిఎస్ ఇన్చార్జి సిడిపిఓ హరిత అన్నారు. పోషణ్ పక్వాడలో భాగంగా మంగళవారం నల్లగొండ పట్టణంలోని రామగిరి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు శ్రీలక్ష్మి, మనీషా, భాగ్యలక్ష్మి, పూలమ్మ, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.