నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ మళ్లీ జయకేతనం ఎగురవేసింది. పార్టీ అభ్యర్థి నోముల భగత్ ప్రతీ రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయంపై నోముల భగత్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ఓటర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తన గెలుపు కోసం కృషిచేసిన టీఆర్ఎస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ఓటర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
— Nomula Bhagath Kumar (@BagathNomula) May 2, 2021
నా గెలుపు కోసం కృషిచేసిన టీఆర్ఎస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.
-మీ నోముల భగత్ కుమార్#NagarjunasagarWithTRS #TelanganaWithKCR pic.twitter.com/s3IJbcWeu7