రామగిరి, మే 20 : తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ఆన్లైన్ పరీక్ష నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం సజావుగా సాగింది. టెట్ పరీక్షను గతంలో మాదిరిగా ఓఎంఆర్ విధానంలో కాకుండా తొలిసారిగా సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో నిర్వహించారు.
టెట్ పరీక్షలు జూన్ 2వరకు కొనసాగనుండగా.. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్పీఆర్ పాఠశాల ఆవరణలో డీపీఎంఎస్ ఆన్లైన్ పరీక్ష కేంద్రంలో తొలి రోజు గణితం, సైన్స్ విభాగంలో జరిగిన పరీక్షకు ఉద యం 185 మందికి 158మంది అభ్యర్థులు హాజరయ్యారు. 27 మంది గైర్హాజరయ్యారు.
మధ్యా హ్నం 185 మందికిగాను 164 మంది అభ్యర్థులు హాజరైనట్లు పరీక్ష కేంద్రం నిర్వాహకులు నీలంరెడ్డి తెలిపారు. పరీక్షలను జిల్లా విద్యాశాఖ కార్యాలయం సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారి ఆర్.రామచంద్రయ్య పరిశీలించారు. పరీక్ష కేంద్రాన్ని డీఈఓ బి.భిక్షపతి ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు.