జాప్యం లేకుండా.. ధాన్యం కొనుగోలు చేయాలి
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యా న్ని జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.
- నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్
తిప్పర్తి, ఏప్రిల్ 14: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యా న్ని జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యాన్ని సీరియల్ ప్రకారం కొనుగోలు చేసి లారీల ద్వారా మిల్లులకు పంపించాలన్నారు.
ఎక్కడా సమ స్య రాకుండా చూడాలన్నారు. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలుకు గానూ జిల్లాలో 426 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటివరకు 286 కేం ద్రాలు ప్రారంభించామన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలన్నారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. కేం ద్రాల్లో తూకం, తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్లు ఏర్పాటు చేశామన్నారు.
ధాన్యం అన్లోడ్ చేసే విషయం లో ఇబ్బందులు సృష్టించకుండా మిల్లర్లతో మాట్లాడమన్నారు. రైతులకు మిల్లుల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఒక అధికారిని నియమించామన్నారు. సాంకేతిక సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని, ఎక్కడైనా ధాన్యంలో తూకం, తాలు, తరుగు వంటి సమస్యలు వస్తే ఈ బృందం తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తుందన్నారు. అనంతరం కలెక్టర్ తిప్పర్తిలోని డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించి పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ పీడీని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

