అర్వపల్లి, ఫిబ్రవరి 04 : అర్వపల్లి మండల పరిధిలోని అడివెంల గ్రామంలో విద్యుత్ షాక్తో కౌలు రైతు మృతి చెందాడు. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం కాసరాబాద్ గ్రామానికి చెందిన పంతం నాగయ్య (32) గత కొన్ని సంవత్సరాలుగా అడివెంలలో రైతుల నుండి పొలంను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. బుధవారం వ్యవసాయ బావి వద్ద వైరు తెగిపోగా సరిచేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగయ్య అవివాహితుడు. ఆయన తల్లి పంతం నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.