శివోహం
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని శివాలయాల్లో ఉత్సవ శోభ నెలకొంది. ఆలయాలు శోభాయమానంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాలు, రంగులతో శివాలయాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.
- మహాశివరాత్రికి ఆలయాలు ముస్తాబు
- రంగులు, విద్యుత్ కాంతులతో ప్రత్యేక శోభ
- అన్ని ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు
రామగిరి, మార్చి 7: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని శివాలయాల్లో ఉత్సవ శోభ నెలకొంది. ఆలయాలు శోభాయమానంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాలు, రంగులతో శివాలయాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. శుక్రవారం ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడనుండగా.. అందుకు తగట్టే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాలకు సిద్ధం చేశారు. క్యూలైన్లు, భక్తుల కోసం మంచినీటి సౌకర్యం, షామియానాలు చలువ పందిళ్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు.
నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో పానగల్ ఛాయా సోమేశ్వరాలయం, వాడపల్లి, మట్టపల్లి శివాలయాలు, పిల్లలమర్రి ఆలయాలు, చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరాలయం, మేళ్లచెరువు స్వయంభు శంభులింగేశ్వరాలయం, సోమప్ప సోమేశ్వరాలయం వంటి ప్రముఖ ఆలయాలకు పెద్దఎత్తున భక్తులు తరలిరానుండడంతో ప్రత్యేక శ్రద్ధ వహించారు. పానగల్ ఆలయాలకు నల్లగొండ పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి ట్రస్మా ఆధ్వర్యంలో ఉచిత బస్ సౌకర్యం కల్పించారు. పండ్లు, పూలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో భువనగిరి పట్టణంతోపాటు, ఆలేరు, చౌటుప్పల్లోని మార్కెట్లు సందడిగా మారాయి. ఉపవాసాల నేపథ్యంలో భక్తులు పండ్లను కొనుగోలు చేస్తుండగా, వ్యాపారులు పండ్ల ధరలు అమాంతం పెంచేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

