మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
2024-25 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18నుంచి ఫిబ్రవరి 6వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
రామగిరి, జనవరి 18 : 2024-25 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18నుంచి ఫిబ్రవరి 6వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. 5వ తరగతిలో కొత్త సీట్లకు, 6, 7, 8 తరగతుల్లో (కేవలం మైనారిటీ) ఖాళీలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల్లో బాలికలు, బాలురు సీట్ల కోసం ఇదే తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు వీరు అర్హులు
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కుటుంబ వార్షిక ఆదాయం రూ.2లక్షలకు మించరాదు. సీట్లను లక్కీ డిప్ పద్ధతిలో ఎంపిక చేసి ప్రవేశాలు కల్పిస్తారు. సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్‌లోని హెల్ప్ లైన్ కేంద్రం 040-23437909 ఫోన్ నంబర్‌కు చేయవచ్చు. http://tmreis. telan gana.gov.in వెబ్సైట్లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నల్లగొండ బాలుర పాఠశాల 9490895916, దేవరకొండ బాలుర 7331170859, నల్లగొండ జూనియర్ కళాశాల 99597 09588, నకిరేకల్ పాఠశాల 72079 98960 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని నల్లగొండ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి టి.విజయాందర్రెడ్డి, ఆర్సీఓ విష్ణు సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలు
బాలికల కోసం హుజూర్నగర్, కోదాడ, నల్లగొండ, ఆలేరు, మిర్యాలగూడ, నకిరేకల్, బాలుర కోసం నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట, చౌటుప్పల్, దేవరకొండ, తుంగతుర్తి, అనుముల పాఠశాలలు ఉన్నాయి. ఐదో తరగతిలో మైనారిటీ విద్యార్థులకు 60, బీసీలకు 10, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, ఓసీలకు 2, ఇంటర్ మొదటి సంవత్సరంలో మైనార్టీలకు 60, బీసీలకు 5, ఎస్సీలకు 2, ఓసీలకు 1 చొప్పున సీట్లను కేటాయించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

