మిర్యాలగూడ, జూన్ 2 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర అవతరణ సాధ్యమైందని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్, తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాల వద్ద వందనాలు సమర్పించి జాతీయ జెండాను, బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేక పోరాటాలు చేశారన్నారు. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ స్వార్ధ రాజకీయ నాయకుల చేతుల్లో విలవిలలాడుతుందన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఏఎంసీ ఛైర్మన ధనావత్ చిట్టిబాబునాయక్, ఉద్యమ నాయకులు యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జునచారి, జొన్నలగడ్డ రంగారెడ్డి, నాయకులు మగ్ధుపాషా, షెహనాజ్బేగం, ఇలియాస్‌ఖాన్, మట్టపల్లి సైదయ్యయాదవ్, మాజీద్, షోయబ్, కుర్ర చైతన్య, నల్లగంతుల నాగభూషణం, నాగరాజు, పెండ్యాల పద్మ, కోదాటి రమా, ధనమ్మ, ఉమా, స్వర్ణలత, రాధా, బుజ్జి పాల్గొన్నారు.