చండూరు, మార్చి 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ విద్యా సంవత్సరం నుండి ఆధునిక వసతులతో ప్రారంభించబోయే తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) ను చండూరులో ఏర్పాటు చేయాలని బీజేపీ చండూరు మండలాధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు కోరారు. సోమవారం చండూరులో ఆయన మాట్లాడుతూ.. ఈ బడులు ప్రీ-ప్రైమరీ నుండి 8వ తరగతి వరకు ప్రారంభమై, అనంతరం 9-12 తరగతులకు విస్తరిస్తాయని ఈ పాఠశాలల్లో AI బోధన, ఉచిత అల్పాహారం, పూర్తి స్టూడెంట్ కిట్లు అందిస్తారని తెలిపారు. మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అన్ని అర్హతలు ఉన్నాయని, చండూర్ హైస్కూల్ ని ఆధునికీకరించి టీపీఎస్గా ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని మునుగోడులో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మర్రిగూడ, నాంపల్లిలో మోడల్ స్కూల్, నారాయణపురం సర్వేల్ లో గురుకులం ఉన్నాయని, చండూరు ప్రభుత్వ విద్యా పరంగా వెనుకబడి ఉన్నదని, కనీసం దీనినైనా ఇక్కడ ప్రారంభించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు భూతరాజు శ్రీహరి, బిజెపి జిల్లా నాయకులు అన్నెపర్తి యాదగిరి, వరికుప్పల గిరి, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఆవుల అశోక్ యాదవ్, సోమ శంకర్, మండల ఉపాధ్యక్షులు జెట్టి యాదయ్య, మండల కార్యదర్శి దాసరి శంకర్, మున్సిపల్ నాయకులు మన్నెం ప్రవీణ్, దోటి శివ, భూతరాజు వేణు, మోర్చా అధ్యక్షులు పులిజాల రవీందర్, దోటి నరేష్, బూత్ అధ్యక్షుడు నిమ్మల వెంకన్న, నాయకుడు జక్కలి సందీప్ పాల్గొన్నారు.