సూర్యాపేట, జూన్ 2 : జిల్లాలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెం డా ఆవిష్కరించి, జిల్లా అభివృద్ధిని వివరించారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పాటైన తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా 2 జూన్ 2014లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందన్నారు.
అనంతరం అమవీరుల కుటుంబాలను మంత్రి సన్మానించారు. హుజూర్‌నగర్‌కు చెందిన నందిగామ అంజయ్య, హుజూర్నగర్ మండలం మాధవరెడ్డిగూడానికి చెందిన సామగాని భరత్, కోదాడ మం డలం రామలక్ష్మీపురం చెందిన అన్నెం అనిత, పెన్‌పహాడ్ మండలం దోసపాడు గ్రామానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులను సత్కరించారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో 169 స్వయం సహాయక సంఘాలకు 23.73 కోట్లు, డీఆర్డీవో ఆధ్వర్యంలో రూ.54 కోట్ల చెక్కులను అందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని పదోతరగతిలో ప్రతిభ చూపిన ఇమాంపేట స్కూల్‌కు చెందిన ముప్పని ప్రవీణ్‌రెడ్డి, చేరిపల్లి మర్కండేయ, మద్దిరాల బీసీ స్కూల్‌కు చెందిన చేగురి గీత, సూర్యాపేట సోషల్ వెల్ఫేర్ స్కూల్‌కు చెందిన నందిని, కోదాడ మైనారిటీ స్కూ ల్కు చెందిన అక్షయలను మంత్రి అభినందించారు. అనంతరం స్టాళ్లను సందర్శించారు. కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ, అదనపు ఎస్పీ రాంబాబు, ఆర్డీవో వేణుమాధవ్, డీఆర్డీవో వీవీ అప్పారావు, డీఎఫ్‌వో సతీష్, పలువురు అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.