తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యమకారులు, ప్రజలు ఉత్సవాల్లో పాల్గొని జాతీయ జెండాలకు వందనం చేశారు. అమరవీరులను స్మరిస్తూ నివాళులర్పించారు. జై తెలంగాణ.. జోహార్ అమరవీరులు అంటూ నినాదాలు చేశారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ హరిచందన, వెంకట్రావ్ జాతీయ జెండాలు ఎగుర వేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా చెందిన పలువురికి సేవా పతకాలు అందించారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించు కొని పదేండ్లు నిండిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వేడుకలు చేపట్టారు. పార్టీతోపాటు జాతీయ జెండాలు ఎగురవేశారు. స్వీట్లు, పండ్లు పంపిణీతోపాటు సేవా కార్యక్రమాలు
నిర్వహించారు.