మునుగోడు, జూన్ 06 : ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన జరుగుతుందని మునుగోడు ఎంఈఓ టి.మల్లేశం తెలిపారు. మునుగోడు మండల వ్యాప్తంగా శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కొరటికల్, మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ మల్లేశం, ప్రధానోపాధ్యాయులు సుంకరి భిక్షంగౌడ్, అంజయ్య అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. మాజీ ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, మాజీ సర్పంచ్ మిరియాల వెంకటేశ్వర్లు, మాజి కో ఆప్షన్ సభ్యుడు పాలకూరి నరసింహ గౌడ్, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్ధులు అన్ని విధాల అభివృద్ధి చెందేలా చూసే శక్తి ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది. విద్యార్దుల సంఖ్య పెంచే విధంగా తల్లిదడ్రులు చూడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థి మానసికంగా ఎదుగుతాడన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఎండీ షాహిద, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు సుధాకర్, సత్తిరెడ్డి, చంద్రం, అన్నపురెడ్డి, బాబు, గంగావతి, అపర్ణ, జయశ్రీ, భవానీ, నవ్య, లక్ష్మీప్రసన్న, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.