కోదాడ, సెప్టెంబర్ 05 : ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు అని, ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో కోదాడ పెన్షనర్స్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వేపల్లి ఉపాధ్యాయ వృత్తి నుండి దేశ అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అధిరోహించిన ఆదర్శ గురువు అన్నారు.
పెన్సనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏడాది విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురుపూజోత్సవం సందర్భంగా విశ్రాంత, సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులను సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుదర్శన్ రెడ్డి, బొల్లు రాంబాబు, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జగన్ మోహన్ రావు, కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి రఘువర ప్రసాద్, భ్రమరాంబ, స్వరూపారాణి, తిరుపతమ్మ, మల్లెంపల్లి వెంకటేశ్వర్లు, కె.నర్సయ్య, జి.నర్సయ్య పాల్గొన్నారు.