హాలియా : టైలర్స్ డే దినోత్సవాన్ని(Taylors Day) గురువారం హాలియాలో టైలర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుట్టుమిషన్ సృష్టికర్త విలియం వొవెల్స్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హాలియాలో ర్యాలీ నిర్వహించారు అనంతరం టైలర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాముల శ్రీనివాస్ మాట్లాడుతూ టైలరింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
50 సంవత్సరాలు దాటిన టైలరింగ్ కార్మికులకు ప్రభుత్వం పింఛన్ అందజేయాలని కోరారు. ప్రభుత్వం టైలర్ షాపులకు ఉచిత కరెంట్ అందజేయడంతో పాటు టైలరింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టైలర్ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గడ్డం రమణయ్య, నాయకులు యాదగిరి బ్రహ్మం మంగయ్య, బ్రహ్మచారి, శీను, కృష్ణా, శంకర్, కరుణాకర్, తదితరులున్నారు.