చెక్డ్యాముల్లో జలకళ
కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేయకపోతే మెదక్ జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంటకు నష్టం జరుగుతుందని ఈ నెల 22న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ సాగు నీరు మహా ప్రభో ’ అనే కథనానికి అధికారులు స్పందించారు.
- కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీవాగులోకి నీటి విడుదల
- గోదావరి జలాలతో 40వేల ఎకరాలకు భరోసా
మెదక్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ) : కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేయకపోతే మెదక్ జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంటకు నష్టం జరుగుతుందని ఈ నెల 22న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ సాగు నీరు మహా ప్రభో ’ అనే కథనానికి అధికారులు స్పందించారు. సాగు నీటి కోసం రైతులు చేస్తున్న ధర్నాలు, ఆందోళనలు పత్రికల్లో వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హల్దీవాగులోకి కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేసింది.
హల్దీవాగు పై మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో ఉన్న చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. హల్దీవాగులో నీరు ప్రవహించడంతో రైతులు ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. హల్దీవాగులోకి సాగునీటిని విడుదల చేయడంతో మెదక్ జిల్లా తూప్రాన్, వెల్దుర్తి, మాసాయిపేట, చిన్నశంరంపేట, చేగుం ట, కుల్చారం రైతులకు మేలు కలుగుతుంది. చెక్‌డ్యామ్‌లు నిండిపోవడంతో పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉంది.
వాగునీరే పంటలకు ఆధారం
హల్దీవాగు వెంట ఉన్న రైతులకు వాగునీరు ఆధారం. వర్షాలకు ప్రవహించే వాగునీరు ఆధారంగా పంటలు సాగు చేసుకున్నాం. వాగులో నీరు ఎండిపోవడంతో సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఉండేవి. సాగుచేసిన భూమిలో సగం ఎండిపోవడం, ఎండలు ఎక్కువగా ఉంటే వేసిన పంటమొత్తం ఎండిపోయేది. బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత గోదావరి నీళ్లు పారుతుండడంతో యాసంగి పంటలకు ఢోకాలేదు.
-నర్సింహులు, రైతు, దామరంచ (మెదక్ జిల్లా )
అంతా కేసీఆర్ చలవే
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ప్రవహిస్తున్న హల్దీవాగు వెంట వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాం. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎండాకాలంలో కూడా వాగులో నీళ్లు ప్రవహించి చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లాయి. యాసంగి పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందింది. వర్షాలు ఆలస్యంగా పడినా పంటలకు నీటి సమస్య ఉండదు. రైతుల సమస్యలు వెలుగులోకి తీసుకువస్తున్న ‘నమస్తే తెలంగాణ’కు రుణపడి ఉంటాం.
-వేన్నవరం మహేందర్‌రెడ్డి,రైతు, ఆరెగూడెం ( మెదక్ జిల్లా)
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

