సూర్యాపేట, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక, లక్షల కోట్ల అప్పులు చేస్తూ..కుప్పలుగా కమీషన్లు దండుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నడని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాటిమాటికి ముఖ్యమంత్రిని మొదలు కొని మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఈ ఫార్ములా అంటున్రు… ఏదో కుంభకోణం జరిగిందంటరు… ఇప్పటికే అదంతా ఉత్తదేనని జనం గ్రహించారన్నారు.
అసలు ఈ ఫార్ములా కాదు.. యూరియా ఫార్మూలా ఎందో చెప్పాలన్నారు. హైకోర్టు ఆర్డర్‌తో గ్రూప్1 ఫార్ములా తేలిపోయిందని కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజలను ఇబ్బందులు పెడుతోందన్నారు. రెండేళ్లుగా ఇచ్చిన హామీలు పక్కన పెట్టి రకరకాల సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కరెంట్, కాళేశ్వరం మీద కమీషన్లు, ట్యాపింగ్ కేసు ప్రతిదీ అబద్ధమని తెలిపోయిందని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో జనం ఆగ్రహంతో ఉన్నారన్నారు.
ఈ ఫార్ములా వన్ కేసు విషయంలో మీ జ్ఞానం ఏపాటిదో జనానికి అర్థమైందన్నారు. ఈ కేసులో బీజేపీతో మిలాఖతై డ్రామాలు చేస్తున్నావని, గ్రూప్ -1 విషయంలో మీ డ్రామాలు బయటపడ్డాయని, ఈ ఫార్ములా బయట పెట్టారన్నారు. కేటీఆర్ ఆనాడే అదో లొట్టపీసు కేసు అన్నారని, అసలు కేసులు పెట్టాల్సి వస్తే ఈ రెండేళ్ల పాలనలో మిమ్మల్ని వందసార్లు జైల్లో పెట్టవచ్చన్నారు. ప్రజలకు చేసిన మోసానికి వాల్ళు ఎంత ఆవేశంగా ఉన్నారో చూస్తలేవా రేవంత్ అని ప్రశ్నించారు.
మీడియాలో స్పేస్ ఆక్యుపై తప్ప జనం గుండెల్లో స్పేస్ ఆక్యుపై చేయలేవన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు ఎట్టా శాపనార్థాలు పెడుతున్నారో, యువత ఎంత కోపంగా ఉన్నారో చూస్తున్నామన్నారు. రైతులు ఓ పక్క యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారని వారి శాపనార్థాలు ఉరకనే పోవని వారి దృష్టిలో ఎప్పటికీ ద్రోహిగానే మిగిలిపోతావన్నారు. కేసును సీబీఐకి అప్పగించడంతోనే మోదీతో నీ బంధం బహిర్గతమైందన్నారు. మోదీతో నీ చోటాభాయ్ బడేభాయ్ బంధం బయటపడిందని ప్రజల దృష్టిలోనే కాదు మీ అధిష్టానం దృష్టిలో కూడా కౌంట్ అవుతున్నావన్నారు. ఈ డ్రామాలు, డైవర్షన్ పాలిటిక్స్‌తో బీఆర్ఎస్ను ఏమీ చేయలేవని తెలంగాణ ప్రజలను ఏ మార్చడం ఎవరికీ సాధ్యం కాదన్నారు.