నల్లగొండ, జనవరి 24 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలికల క్యాంపస్లో విద్యార్థినులకు స్వెటర్లు, దుప్పట్లను మండల స్పెషల్ ఆఫీసర్, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రమేశ్ అందజేశారు. ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఏఎస్డబ్ల్యూఓ వెంకటేశ్వర్లు, హెచ్డబ్ల్యూఓఎస్ విజయలక్ష్మి, స్వప్న, దూసరి భారతమ్మ పాల్గొన్నారు.