కట్టంగూర్, అక్టోబర్ 15 : సమతుల ఆహారం ద్వారా సుస్థిర ఆరోగ్యం సాధ్యమని ఐసీడీఎస్ సూప్ర్వైజర్ ఎస్.పద్మావతి అన్నారు. కట్టంగూర్ మండలంలోని దుగినవెల్లి ఉన్నత పాఠశాలలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. పోషణ మాసం కార్యక్రమాన్ని గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పౌష్టికాహార ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, ఉపాధ్యాయులు మురళయ్య, కరుణాదేవి, శ్రీనివాసరావు, వెంకట్ రెడ్డి, సలీం, వెంకటకృష్ణ, లీలావతి, పీఈటీ సైదులు, అంగన్వాడీ టీచర్లు వాణి, జ్యోతి, ఉప్పలమ్మ, కళమ్మ పాల్గొన్నారు.