మానవ తప్పిదాలతో ఆక్సిజన్ దొరకని పరిస్థితులు ఉత్పన్నం
33శాతం ఉండాల్సిన గ్రీన్ కవర్ సూర్యాపేట జిల్లాలో 3 శాతమే..
ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి
సీఎం కేసీఆర్ సంకల్పంతో ఉద్యమంలా హరితహారం
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
పర్యావరణ కాలుష్యం అన్నది ప్రపంచానికి పెను సవాల్‌గా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాశ, తెలియనితనం కారణంగా ఈ దుస్థితికి చేరామన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఆక్సిజన్ దొరుకని పరిస్థితులు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు. ఆదివారం నాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం సూర్యాపేటలో గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. సూర్యాపేట పురవీధుల్లో స్వయంగా సైకిల్ తొక్కి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో 33శాతం
ఉండాల్సిన అడవులు మూడున్నర శాతమే ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి పౌరుడూ బాధ్యతగా మొక్కలు నాటి, సంరక్షించాలని పిలుపునిచ్చారు.
సూర్యాపేటటౌన్, జూన్ 4 : పర్యావరణ సమస్య ప్రపంచానికే సవాల్‌గా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కాలుష్యం విజృంభిస్తుండడంతో భూ మండలమే ప్రమాదంలో పడిందని గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక గ్రీన్‌క్లబ్ నిర్వాహకుడు ముప్పారపు నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాగే నీరు, పీల్చే గాలి, శరీరంలో కాలుష్యం చేరడంతో మానవాళి బెంబేలెత్తి పోతుందన్నారు. అడవుల నరికివేత అందుకు ప్రధాన కారణంగా మారిందని పేర్కొన్నారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్‌తో ఆక్సిజన్ దొరకని పరిస్థితులు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు.
33 శాతం ఉండాల్సిన అడవులు 26 శాతానికి పడిపోవడం తీవ్ర దుష్పరిణామానాలకు దారి తీస్తుందన్నారు. వీటిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 220 కోట్ల మొక్కలు నాటించే హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్‌క్లబ్ సూర్యాపేట వారు భాగస్వాములవ్వడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, సీనియర్ న్యాయవాదులు జె.శశిధర్, తలమల్ల హసేన్, గోండ్రాల అశోక్, గ్రీన్‌క్లబ్ కార్యదర్శి తోట కిరణ్, పారిశ్రామికవేత్త మీలా మహదేవ్, తోట శ్యాంప్రసాద్, రాచర్ల కమలాకర్, గండూరి కృపాకర్, వైద్యులు హర్షవర్ధన్, రామ్మూర్తి, సందీప్, వాసవీక్లబ్ సభ్యులు రాచకొండ శ్రీనివాస్, కలకోట లక్ష్మయ్య, బజ్జూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.