మద్దిరాల, ఏప్రిల్ 19 : వరంగల్‌లో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఈ నెల 22న ఎడ్లబండ్లపై రైతులు స్వచ్ఛందంగా తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గ మధ్యంలో రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు మద్దిరాల మండల కేంద్రంలో స్థలాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శనివారం పరిశీలించారు.
మనుషులు, ఎద్దులకు అన్ని సౌకర్యాలు ఉండేలా స్థలం ఉండాలని పార్టీ నాయకులకు సూచించారు. రజతోత్సవ సభకు సూర్యాపేట జిల్లా నుంచి రైతులు, బీఆర్ఎస్ నాయకులు స్వచ్ఛందంగా తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎస్ఏ రజాక్, నాయకులు ఉన్నారు.