కట్టంగూర్, నవంబర్ 04 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. మంగళవారం మండలంలోని చెర్వు అన్నారం ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్ 14-17 బాల, బాలికల హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని మాట్లాడారు. జట్టు ఎంపిక క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా జరగాలన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందుతాయన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కందాల రమ, క్రీడల ఆర్గనైజింగ్ సెక్రెటరీ చింతకాయల పుల్లయ్య, పంచాయితీ కార్యదర్శి మామిడి ఉపేందర్, వ్యాయమ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కవిత, చైతన్య కుమార్, వెంకట్రెడ్డి, ఉస్మాన్, మల్లేశ్, శంకర్, నరేశ్, అక్బర్, పూర్ణ, అంజి, రాము, చంద్రశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.