కట్టంగూర్, ఫిబ్రవరి 13 : విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని వందేమాతరం ఫౌండేషన్ సెక్రటరీ ఏడమ మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో వందేమాతరం ఫౌండేషన్ సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ డైమండ్, లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ సంయుక్తంగా నిర్వహించిన యువ వికాసంలో భాగంగా వ్యక్తిత్వ వికాసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం చదువుపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులకు మెలుకువలు, సలహాలు, సూచనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్, ఎంఈఓ అంబటి అంజయ్య, ఏదుల్ల అంజిరెడ్డి, అలుగుబెల్లి కురుణాకర్ రెడ్డి, బండ పురుషోత్తంరెడ్డి, సముద్రాల అశోక్, నన్నూరి నాగిరెడ్డి, అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి, లయన్స్ క్లబ్ కట్టంగూర్ కింగ్స్ అధ్యక్షులు చిక్కు శేఖర్, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి పోగుల రాములు, సభ్యులు బొడ్డుపల్లి వెంకన్న, గోళిక ఉమాపతి, ఉపాధ్యాయులు చిన్ని శ్రీనివాస్, జయమ్మ, రాణి, అబ్దుల్ గఫూర్ పాల్గొన్నారు.