రామగిరి, జూలై 28 : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని హాస్టల్స్ నిర్వాహకులకు నల్లగొండ మండల ఇన్చార్జి, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రమేశ్ సూచించారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం దగ్గర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలికల A,b,c,d హాస్టల్స్లను ఆయన తనిఖీ చేశారు. హాస్టల్స్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వంటగది, మూత్రశాలలు, స్నానపు గదులు శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న వసతులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్డబ్ల్యూఓఎస్ స్వప్న, సత్యవతి, దూసరి భారతమ్మ పాల్గొన్నారు.