మేళ్లచెర్వు : మేళ్లచెర్వు మండలం ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక కోదాడలోని బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి మూడు రోజులైనా తిరిగి రాలేదు. దీంతో ఆ బాలిక అదృశ్యంపై అమ్మమ్మ, తాతయ్య ఆందోళనకు గురయ్యారు. కోదాడ కళాశాలలో ఇంటర్మీడియట్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసి ఇంటి వద్దే టైలరింగ్ నేర్చుకుంటున్నది. ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ, తాతయ్య ఇంట్లోనే నివసిస్తున్నది. ఇదే సమయంలో కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయంతో నాలుగు రోజుల క్రితం కోదాడకు వచ్చింది. నాటి నుంచి మూడు రోజుల వరకూ ఇంటికి రాకపోవడంతో అమ్మమ్మ, తాతయ్య బంధువులకు ఈ విషయం తెలిపారు. ఇంట్లో వదిలి వెళ్లిన ఫోన్ చూస్తే.. ఇన్‌స్టాగ్రామ్‌లో కోదాడ విద్యార్థి విషయం వెలుగు చూసింది.
అమ్మమ్మ తాతయ్యలు బంధువులతోపాటు కోదాడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సదరు బాలుడ్ని గుర్తించి పోలీసులు విచారించినా ప్రయోజనం లేకపోయింది. సదరు విద్యార్థి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అమ్మాయి ఆచూకీ నేటికీ తెలియక ఆ అమ్మాయి అమ్మమ్మ, తాతయ్య ఆందోళన చెందుతున్నారు అమ్మాయి అమ్మాయి విషయమై కోదాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా తమ పరిధి కాదనడంతో మేళ్లచెరువు పోలీసుల్ని ఆశ్రయించారు.