రామగిరి, ఆగస్టు 13 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి ఆదేశాలతో బుధవారం మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంజీయూ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, వర్సిటీ హాస్టల్స్ వార్డెన్ డాక్టర్ నీలకంఠం శేఖర్, సైన్స్ కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, వార్డెన్ ఆదిరెడ్డి బాలుర హాస్టల్స్ వద్ద విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు క్రీయశీలక పాత్ర పోషించాలన్నారు. వాటికి దూరంగా ఉంటూ జీవిత లక్ష్యంపై దృష్టి సారించి తల్లిదండ్రుల, వర్సిటీ ఆశయాలను నెరవేర్చాలన్నారు.
అదే విధంగా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పానగల్ క్యాంపస్‌లో ఇన్చార్జి డాక్టర్ విజయ్‌కుమార్, అధ్యాపకులు అశ్విని, శ్రీనివాస్, జ్యోతిరాణి, రామచంద్రు, కేర్ టేకర్ కామేశ్వర్ ఆధ్వర్యంలో విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు. అలాగే నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, సీఓఈ నాగరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Nalgonda : ఎంజీయూలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన