కట్టంగూర్, ఏప్రిల్ 2 : ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్న బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల, కట్టంగూర్, ముత్యాలమ్మగూడెం గ్రామాల్లో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఏ కార్డుదారుడైన నివాసం ఉండే ప్రాంతంలోని రేషన్ షాపులో సన్న బియ్యం పొందవచ్చు అని తెలిపారు. పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నందున అన్ని చౌక దుకాణాలపై నిఘా ఉంచాలని రెవెన్యూ సివిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు.
లబ్ధిదారులు సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి కోటేశ్వరరావు, తాసీల్దార్ గుగులోతు ప్రసాద్, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాశరావు, సివిల్ సప్లయ్ డీటీ రాచకొండ జ్యోతి, ఆర్ఐ కుమార్రెడ్డి, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ, మాజీ ఎంపీపీ రెడ్డిపల్లి వెంకటమ్మ, సాగర్, పెద్ది సుక్కయ్య పాల్గొన్నారు.