కట్టంగూర్, మార్చి 23 : క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. శనివారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ చట్ట విరుద్ధమని ఇది ఆర్థికంగా, సామాజికంగా జీవితాలను నాశనం చేస్తుందన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
క్రికెట్ బెట్టింగ్‌ల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు. శ్రమించకుండా వచ్చే నగదు వెనుక అనేక నష్టాలు దాగి ఉండడంతో పాటు కేసుల్లో నిందితులుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. యువత, విద్యార్థులు బెట్టింగ్ జోలికి వెళ్లకుండా చదువుపై దృష్టి సారించాలని కోరారు. మండల వ్యాప్తంగా బెట్టింగ్ లపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని కావునా పిల్లలపై తల్లిదడ్రులు కూడా ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. బెట్టింగ్ కార్యకలాపాలు జరిగినట్లయితే వెంటనే డయల్ 100కు కాల్ చేసి తెలుపాలన్నారు.