చండూరు, జూన్ 03 : ప్రభుత్వ బడులను బలోపేతం చేయడమే టీఎస్ యూటీఎఫ్ లక్ష్యమని యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రామలింగయ్య అన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన ఊరి ప్రభుత్వ బడి ముద్దు ప్రైవేట్ బడి వద్దు అనే నినాదంతో ప్రచార జాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధనతో పాటు ఉచిత దుస్తులు, మధ్యాహ్న భోజనమం, ఉచిత పుస్తకాలు అందజేస్తున్నట్లు చెప్పారు.
ప్రతి నెల తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తూ వారి అంగీకారంతో పాఠశాల నడుపుతున్నట్లు చెప్పారు. పిల్లల అభివృద్ధిని ఊరి అభివృద్ధిగా భావిస్తూ ప్రభుత్వ పాఠశాల పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గేర నరసింహ, మునుగోడు మండలాధ్యక్షుడు బికుమల్ల రాములు, ప్రధాన కార్యదర్శి పెరిక నరసింహ, చండూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాంపల్లి సైదులు, గంగాధర్, గ్రామస్తులు పాల్గొన్నారు.