చండూరు, ఏప్రిల్ 25 : నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధుల నుండి వీధి లైట్లు మంజూరు అయ్యాయి. గ్రామానికి రూ.2 లక్షలతో 56 వీధిలైట్లు మంజూరు కాగా శుక్రవారం చండూరు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎండీ సుజావుద్దీన్ చేతుల మీదుగా గ్రామ పంచాయతీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోనున్నట్లు తెలిపారు. ఏ సంక్షేమ కార్యక్రమాలు అయినా పార్టీలకతీతంగా పేదలకు అందే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వరికుప్పల ఇద్దయ్య, పార్టీ సీనియర్ నాయకులు పల్స యాదయ్య, కట్కూరి సైదులు, వరికుప్పల కృష్ణయ్య, సరికొండ ముత్యాలు, కట్కూరి లింగస్వామి, కట్కూరి రామలింగయ్య, చేదురువెల్లి జంగయ్య, వర్కాల నాగరాజు, యువజన నాయకులు కట్కూరి సందీప్, ఎంపల్ల స్వామి, దేవసారి చరణ్, పార్టీ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.