– తుంగతుర్తి తాసీల్దార్కు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం వినతి
తుంగతుర్తి, ఏప్రిల్ 01 : ఏప్రిల్ నెలాఖరు వరకు ఎస్సారెస్పీ జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం బుధవారం తుంగతుర్తి తాసీల్దార్ దయానందంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. ఈ నెల 3వ తారీఖు వరకే చివరి విడత నీటి విడుదల పూర్తి అవుతుందని ఇరిగేషన్ అధికారులు ప్రకటించడంతో తుంగతుర్తి మండలంలో రెండు వేల ఎకరాల వరి పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ఏప్రిల్ నెలాఖరు వరకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నీటి విడుదల చేయకపోతే వేల ఎకరాల పంట పొలాలు ఎండిపోయి రైతులు నష్టపోతారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకుంటే ప్రజా పాలన సమావేశాల్లో రైతాంగం ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు తునికి సాయిలు, గోపగాని రమేష్, తడకమళ్ల రవికుమార్, సోమనర్సయ్య, మాతంగి కరుణాకర్, వెంకటయ్య, వెంకటేష్, సాయికిరణ్, మల్లికార్జున్, రామారావు పాల్గొన్నారు.