– ఎంజీయూ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్
రామగిరి, డిసెంబర్ 03 : శ్రీకాంతాచారి త్యాగమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మలుపు అని మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ అన్నారు. బుధవారం శ్రీకాంతాచారి 16వ వర్ధంతిని పురస్కరించుకుని వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. అన్యాయంపై నిలబడే ధైర్యం, విద్యార్థి హక్కుల కోసం పోరాడే శక్తి, ప్రజాస్వామ్య విలువలను కాపాడే నిబద్ధత ప్రతి ఒక్కరిలో ఉండాలని, అదే శ్రీకాంతాచారి ఆశయం అదే బీఆర్ఎస్వీ ధ్యేయం అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు గాదె శివ, విద్యార్థి నాయకులు అక్షయ్, దినేశ్, శ్రావణి, అలేఖ్య, పావని పాల్గొన్నారు.