దామరచర్ల, డిసెంబర్ 14 : రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆర్డీఓ చెన్నయ్య తెలిపారు. మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కల్యాణలక్ష్మి పథకం రికార్డులను పరిశీలించారు. పునరావాస కేంద్రాల భూముల పట్టాలపై తాసీల్దార్ ఖదీర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌ను కలిసిన పునరావాస కేంద్రాల నిర్వాసితులు తమ సమస్యపై వినతిపత్రం అందించారు.
సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కలెక్టర్‌ను ఆదేశించడంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీఓ తెలిపారు. అర్హులైన నిర్వాసితులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. వాటిపై క్షేత్రస్థాయిలో సర్వే చేసి కలెక్టర్‌కు నివేదిక అందిస్తామన్నారు. ఆయన వెంట ఆర్ఐ సతీశ్, సీనియర్ అసిస్టెంట్ మహేందర్‌రెడ్డి ఉన్నారు.