‘ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్ లైసెన్సులపై ప్రత్యేక దృష్టి’
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్ లైసెన్సులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర తెలిపారు. నగర అభివృద్ధికి అవసరమైన ఆదాయ వనరులను బలోపేతం చేయడం అత్యంత అవసరమన్నారు. ఈ సందర్భంగా కమిషనర్..
– నల్లగొండ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర
నీలగిరి, ఏప్రిల్ 10 : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్ లైసెన్సులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర తెలిపారు. నగర అభివృద్ధికి అవసరమైన ఆదాయ వనరులను బలోపేతం చేయడం అత్యంత అవసరమన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నగరంలోని వ్యాపారులు, ఆస్తి యజమానులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు తమ బాధ్యతలను సమయానికి నిర్వర్తించాలని కోరారు. ట్రేడ్ లైసెన్సుల విషయమై నగరంలోని అన్ని వ్యాపార సంస్థలు, వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్సుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లైసెన్సులను తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని ఆదేశించారు. ట్రేడ్ లైసెన్సులు లేకుండా వ్యాపారం నిర్వహించడం చట్ట విరుద్ధమని, అటువంటి వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు.
అలాగే ఆస్తి పన్ను విషయంలో ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం రిబేట్ అవకాశాన్ని వినియోగించుకుని, నగరంలోని అన్ని ఆస్తి యజమానులు తమ పన్ను బకాయిలను తక్షణమే చెల్లించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఆస్తి పన్ను చెల్లిస్తున్న సీనియర్ సిటిజన్లకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, అందరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు గడ్డం శ్రీనివాస్, నంద్యాల ప్రదీప్ రెడ్డి, ఆర్వో శివరామిరెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

