అనంతగిరి, మార్చి 21 : అనంతగిరి మండలంలోని బొజ్జగూడెం తండాలో వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా సర్పంచ్ గుగులోతు నీలాబాయి శ్రీనివాస్ ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఉన్న చేదుడు బావిలో శనివారం కూలీలతో పూడిక తీయించి నీటిని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బావిలోని నీటిని ఓవర్ హెడ్ ట్యాంక్‌కు తరలించి తద్వారా గ్రామానికి మంచినీటిని పంపిణీ చేయాలనేది తమ ఉద్దేశం అన్నారు. వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.