నల్లగొండ సిటీ, మే 16 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణీ సంగమంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 15న ప్రారంభమైన పుష్కరాలు 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నల్లగొండ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 7 డిపోల నుంచి కాళేశ్వరానికి 32 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి శుక్రవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.