నల్లగొండ, అక్టోబర్ 24 : ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని రౌడీ షీటర్స్ దాదాపు 40 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మెలగాలన్నారు. జిల్లా పరిధిలో రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్ల కార్యకలాపాలు పోలీసుల నిఘాలో ఉన్నాయని, చట్ట వ్యతిరేక కార్యలాపాలు ఆర్థిక, భూ సెటిల్మెంట్లు వంటివి చేస్తూ సామాన్య ప్రజలపై దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారైన చట్టం నుంచి తప్పించుకోలేరని, ఇప్పటికే పలువురికి శిక్షలు విధించడం జరిగిందన్నారు.
జిల్లాలో ప్రతి ఒక్కరి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్) నమోదు చేయడానికి వెనుకాడబోమన్నారు. సత్ప్రవర్తనతో మెలిగే వారికి పోలీస్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. తమ పాత పద్ధతులను వదులుకుని సత్ప్రవర్తనతో మంచిగా మారి ఎలాంటి నేరాలు చేయకుండా సమాజాభివృద్ధికి దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవ రావు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఆర్.ఐ హరిబాబు, టూ టౌన్ ఎస్ఐ సైదులు, రూరల్ ఎస్ఐ సైదాబాబు పాల్గొన్నారు.

Nalgonda : రౌడీ షీటర్లకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ కౌన్సెలింగ్
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయంలో రక్త దానం శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులతో పాటు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని దాదాపు 150 యూనిట్లు రక్తదానం చేయడం జరిగిందన్నారు.
అదే విధంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఆన్లైన్ వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ పోటీల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. పోటీలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో నిర్వహించబడతాయన్నారు. విద్యార్థులు తమ వ్యాసాలను ఈ నెల 30వ తేదీ లోపు సమర్పించాలన్నారు. ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అలాగే జిల్లా స్థాయిలో 1వ, 2వ, 3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
“Drugs Menace: Role of Police in Prevention and How Students Can Stay Away from Drugs”
( డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు )
పోటీలో పాల్గొనే విధానం:
1. కింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేసి పాల్గొనాలి
https://forms.gle/jaWLdt2yhNrMpe3eA
2. మీ పేరు, విద్యార్హత, ఇతర వివరాలు నమోదు చేయాలి
3. మీ వ్యాసాన్ని పేపర్‌పై రాసి, దాన్ని ఫొటో లేదా పీడీఎఫ్ రూపంలో (500 పదాలు మించకూడదు) అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

Nalgonda : రౌడీ షీటర్లకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ కౌన్సెలింగ్