నీలగిరి, డిసెంబర్ 02 : నారాయణపేట జిల్లా మక్తల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన బందోబస్తుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో గుర్రంపోడ్ మండలం జువ్విగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఏఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారు. నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని మంగళవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా కోరారు. ఆయన వెంట నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, టూ టౌన్ ఎస్ఐ వై.సైదులు ఉన్నారు.