నిడమనూరు, జూన్ 18 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం సులభతరమవుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని తుమ్మడం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను గుర్తించి భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టం అమలులోకి తెచ్చిందన్నారు.
చట్టంతో ప్రజలకు మెరుగైన ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాసీల్ధార్ జంగాల కృష్ణయ్య, గిర్ధావర్ సందీప్, మండల సర్వేయర్ విజయ్ కుమార్, దాడి రాజిరెడ్డి, నాయకులు ముంగి శివమారయ్య, కొండా శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచులు కుంకుట్ల కోటమ్మయాదగిరి, పిల్లి రమేశ్, బుర్రి వెంకన్న పాల్గొన్నారు.