మోతె, డిసెంబర్ 9: గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ యాదవేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ర్టానికి చెందిన సుభాశ్ హంతాల అనే గంజాయి విక్రేతకు నెల రోజుల క్రితం అరకు వెళ్తుండగా రైలులో బత్తుల హరీశ్, బత్తుల విరాట్ అనే ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ముగ్గురు కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. ఈ నెల 5న హరీశ్, విరాట్ కలిసి సుభాష్‌కు ఫోన్ చేసి గంజాయి కావాలని, ఖమ్మం తీసుకురావాలని చెప్పారు. దీంతో సుభాశ్ 8వ తేదీన గంజాయితో ఖమ్మం వచ్చాడు.
విరాట్, హరీశ్‌తో పాటు షేక్ హుస్సేన్ బాషా అనే మరో వ్యక్తి సుభాష్‌ను కలిసి గంజాయితో రెండు బైక్‌లపై మామిళ్లగూడెం గ్రామ శివారులోని సింగరేణి టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత హరీశ్, విరాట్ కలిసి తమకు పరిచయస్థులైన గంజాయి సేవించే వెలుగు జయసింహ, దోసపాటి కల్యాణ్‌రామ్, పగడాల ఉదయ్‌కుమార్‌రెడ్డి, వెలుగు ఆనంద్, కొండా ఉదయ్‌ను టోల్‌ప్లాజా వద్ద గల ఓ వెంచర్‌కు పిలిచారు. అప్పటికే సమాచారం అందుకున్న మోతె పోలీసులు దాడులు నిర్వహించి సుభాష్, హరీశ్, విరాట్, జయసింహ, కల్యాణ్‌రామ్, ఉదయ్‌కుమార్‌రెడ్డిని పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగతా ముగ్గురు మైనర్లని ఎస్ఐ తెలిపారు. నిందితుల నుంచి 1.640 కిలోల గంజాయిని, ఐదు సెల్ఫోన్లు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.