– ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాలు
– హాజరుకానున్న 18,827 మంది విద్యార్థులు
రామగిరి, నవంబర్ 11 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలో సెమిస్టర్ 1, 3, 5 రెగ్యూలర్ అండ్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 13 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వర్సటీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18,827 మంది విద్యార్థులు హాజరవుతుండగా 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకై ఆన్లైన్ ప్రశ్నపత్రంతో పాటు అందుకు సంబందించి మెటిరియల్స్ ను ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు ఎంజీయూ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో సరఫరా చేశారు. అదే విధంగా పరీక్షల పట్టిష్ట నిర్వహణకై సిట్టింగ్ స్క్వాడ్‌తో పాటు ప్లైయింగ్ స్కాడ్స్ బృందాలను ఏర్పాటు చేశారు.
పరీక్షల నిర్వహణకై ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 30 (నల్లగొండ జిల్లాలో 12, సూర్యాపేట జిల్లాలో 02, యాదాద్రి భునగిరి జిల్లాలో 03) పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు మొత్తం 18,827 మంది హాజరవుతున్నారు. 1వ సెమిస్టర్లో 5,400 మంది, 3వ సెమిస్టర్లో 5,830, 5వ సెమిస్టర్లో 5,597 మంది విద్యార్థులు ఉన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంజీయూ పరిధిలో నిర్వహించే డిగ్రీ సెమిస్టర్ 1, 3, 5 రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షలు సజావుగా సాగేలా వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవి ఆదేశాలతో సిట్టింగ్ స్వ్కాడ్, ప్లైయింగ్ స్వ్కాడ్ బృందాలను ఏర్పాటు దేశాం. పరీక్ష కేంద్రాల్లో ఏమైనా తప్పులు జరిగితే ఆయా పరీక్ష కేంద్రాల చీప్ సూపరింటెండ్స్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. విద్యార్థులందరికీ సకాలంలో హాల్ టికెట్స్ అందించాలి.